శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Aug 03, 2020 , 00:11:17

ఇంట్లో నుంచే ఇన్ఫర్మేషన్‌ అప్‌డేట్‌

ఇంట్లో నుంచే ఇన్ఫర్మేషన్‌ అప్‌డేట్‌

కస్టమర్లకు ఆన్‌లైన్‌ సేవలను అందిస్తున్నది ఎల్‌ఐసీ. తమ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలనుకునేవారు ఇంట్లో నుంచే ఈ సర్వీసును వినియోగించుకోవచ్చు. కేవలం నిమిషాల్లో పనైపోతుంది. దీంతో పాలసీలకు మొబైల్‌ నెంబర్ల అనుసంధానం, ఈ-మెయిల్‌ ఇతరత్రా వివరాలను జోడించాలంటే ఇకపై ఎల్‌ఐసీ ఆఫీసులదాకా వెళ్లాల్సిన పనిలేకుండా అయ్యింది. పాలసీలకు సంబంధించిన అన్ని వివరాలను కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్‌ ద్వారానే ఎల్‌ఐసీ పంపిస్తుంది. ప్రీమియం గడువు తేదీలు, చెల్లింపుల వివరాలు ఇలాగే అందుతున్నాయి. కాబట్టి పాలసీదారులు తమ పాలసీలకు మొబైల్‌ నెంబర్లను, ఈ-మెయిల్‌ చిరునామాలను అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం తప్పక ఉన్నది.

ఎలా చేసుకోవాలి?

www.licindia.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కస్టమర్‌ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ కాంటాక్ట్‌ వివరాల అప్‌డేట్‌పై నొక్కితే కొత్త పేజీ వస్తుంది. అందులో మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ తదితర వివరాలను నమోదు చేయాలి. తర్వాత డిక్లరేషన్‌ మీద క్లిక్‌ చేసి, సబ్మిట్‌ చేయాలి. అనంతరం మీ పాలసీ వివరాలను పేర్కొనాలి. దీంతో ఓ కొత్త విండో తెరుచుకుంటుంది. సెండ్‌ రిక్వెస్ట్‌ కొడితే ఎల్‌ఐసీ నుంచి ధ్రువీకరణ కాల్‌ మీ మొబైల్‌ నెంబర్‌కు వస్తుంది.logo