శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 23, 2021 , 01:29:51

ఎల్‌ఐసీ కొత్త పాలసీ బీమా జ్యోతి

ఎల్‌ఐసీ కొత్త పాలసీ బీమా జ్యోతి

ముంబై: ఎల్‌ఐసీ ఓ సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. బీమా జ్యోతి పేరుతో రక్షణ, పొదుపు ప్రయోజనాల కలయికలో ఈ ప్లాన్‌ను తెచ్చింది. మెచ్యూరిటీ సమయంలో పాలసీదారుకు పెద్ద మొత్తంలో నగదు అందుతుంది. అలాగే పాలసీ కాలంలో పాలసీదారు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తుంది. లక్ష రూపాయలకు తగ్గకుండా ఈ ప్లాన్‌లో ఎంత విలువైన పాలసీనైనా పొందవచ్చు. అలాగే 90 రోజుల చిన్నారి దగ్గర్నుంచి 60 ఏండ్లలోపు వయసున్న ఎవరైనా ఈ పాలసీకి అర్హులే. పాలసీ కాలపరిమితి 15 ఏండ్ల నుంచి 20 ఏండ్ల వరకు ఉంటుంది. 

VIDEOS

logo