బుధవారం 03 మార్చి 2021
Business - Feb 09, 2021 , 18:05:37

ఎల్‌ఐసీ ఐపీఓలో 10 శాతం షేర్లు పాలసీదారులకు కేటాయింపు : అనురాగ్‌ ఠాకూర్

ఎల్‌ఐసీ ఐపీఓలో 10 శాతం షేర్లు పాలసీదారులకు కేటాయింపు : అనురాగ్‌ ఠాకూర్

న్యూఢిల్లీ : ఎల్‌ఐసీ ఐపీఓ ఇష్యూలో పది శాతం వాటాలను పాలసీదారులకు కేటాయిస్తామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. ఎల్‌ఐసీలో మెజారిటీ వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతూ సంస్థపై నియంత్రణ కలిగిఉంటుందని, పాలసీదారుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఐపీఓ ఇష్యూ పరిమాణంలో పది శాతం ఎల్‌ఐసీ పాలసీదారులకు కేటాయించాలని 2021-22 ఫైనాన్స్‌ బిల్లులో ప్రతిపాదించామని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు రానుందని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ ఐపీఓకు సన్నాహాలు చేపట్టిన ప్రభుత్వం డెలాయిట్‌, ఎస్‌బీఐ క్యాప్స్‌ను ప్రీ-ఐపీఓ లావాదేవీల సలహాదారులుగా నియమించింది. 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.  1.75 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. 

VIDEOS

logo