సోమవారం 01 జూన్ 2020
Business - Apr 24, 2020 , 00:13:09

ఎల్‌ఐసీ హౌజింగ్‌ వడ్డీరేట్ల తగ్గింపు

ఎల్‌ఐసీ హౌజింగ్‌ వడ్డీరేట్ల తగ్గింపు

ముంబై, ఏప్రిల్‌ 23: మార్ట్‌గేజ్‌ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) వడ్డీరేటును 7.5 శాతానికి తగ్గించింది. ఇందుకు సిబిల్‌ స్కోర్‌ 800 ఆపై ఉన్న కొత్తవారికి మాత్రమే ఈ తక్కువ వడ్డీరేటుకు రుణాలు అందించనున్నట్లు గురువారం సంస్థ ప్రకటించింది. కరోనాతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి  నిధుల లభ్యతను పెంచడానికి రిజర్వుబ్యాంక్‌ తీసుకున్న చర్యలకు అనుగుణంగా సంస్థ వినియోగదారులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో సిద్దార్థ మోహంతి తెలిపారు. నూతనంగా గృహాన్ని కొనుగోలు చేసేవారికి అదనంగా 10 బేసిస్‌ పాయింట్ల తక్కువ వడ్డీకే రుణాలు అందించడంతో వడ్డీరేటు 7.4 శాతానికి తగ్గనున్నది.  logo