మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 22, 2020 , 00:18:08

రూ.50వేల పైమాటే

రూ.50వేల పైమాటే

  • తులం పసిడి ధర రూ.50,214 

న్యూఢిల్లీ: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. తులం అర లక్షకుపైనే పలుకుతున్నది. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల విలువ ఏకంగా రూ.50,214ను తాకింది. సోమవారంతో పోల్చితే రూ.192 పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో మదుపరులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌ లేకున్నా.. పుత్తడి ధరలకు రెక్కలొస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా దౌడు తీస్తున్నాయి. కిలో ధర ఈ ఒక్కరోజే రూ.1,832 ఎగబాకి రూ.56,441ని చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,822 డాలర్లుగా నమోదైంది. వెండి 20.36 డాలర్లుగా ట్రేడైంది. ‘కరోనా కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థల్ని రక్షించుకునేందుకు అమెరికా, ఐరోపా యూనియన్‌లు  మరిన్ని ఉద్దీపనలను ప్రకటిస్తాయన్న ఆశలు కూడా బంగారం ధరలను అంతకంతకూ పెంచేస్తున్నాయి’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ అన్నారు.


logo