బుధవారం 03 మార్చి 2021
Business - Jan 19, 2021 , 00:34:14

కొత్త వేరియంట్‌లో లెక్సస్‌ ఫ్లాగ్‌షిప్‌ సెడాన్‌

కొత్త వేరియంట్‌లో లెక్సస్‌ ఫ్లాగ్‌షిప్‌ సెడాన్‌

  • ఎల్‌ఎస్‌ 500హెచ్‌ నిషిజిన్‌ ధర రూ.2.22 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 18: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్‌ తన ఫ్లాగ్‌షిప్‌ సెడాన్‌ ఎల్‌ఎస్‌ను సరికొత్త వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఎల్‌ఎస్‌ 500హెచ్‌ నిషిజిన్‌' పేరుతో తీసుకొచ్చిన ఈ వేరియంట్‌ ఎక్స్‌-షోరూమ్‌ (ఢిల్లీ) ధరను రూ.2.22 కోట్లుగా నిర్ణయించింది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎల్‌ఎస్‌ 500హెచ్‌ మోడల్‌ను అప్‌డేటెడ్‌ చేసి కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.1.91 కోట్లుగా నిర్ణయించింది. దేశీయ మార్కెట్లో ఎల్‌ఎస్‌ 500హెచ్‌ వేరియంట్‌కు మంచి స్పందన రావడంతో మరింత అద్భుతమైన ఇంటీరియర్లతో ‘ఎల్‌ఎస్‌ 500హెచ్‌ నిషిజిన్‌'ను తీర్చిదిద్దినట్లు లెక్సస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పీబీ వేణుగోపాల్‌ తెలిపారు. 


VIDEOS

logo