శనివారం 06 జూన్ 2020
Business - May 09, 2020 , 19:48:18

నోయిడాలో లావా కార్యకలాపాలు షురూ

నోయిడాలో లావా కార్యకలాపాలు షురూ


న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ బ్రాండ్‌ లావా శనివారం  నుంచి నోయిడాలోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. ఈ కేంద్రంలో 20 శాతానికి పైగా ఉత్పత్తి సామర్ధ్యంతో పనులు మొదలుపెట్టినట్టు లావా సంస్థ తెలిపింది. రాష్ట్ర అధికారుల నుంచి ఆమోదం  లభించిన  తర్వాత ఇక్కడ పనిచేస్తున్న 3 వేల మంది ఉద్యోగుల నుంచి కేవలం 600 మందిని విధుల్లోకి తీసుకొని కార్యకలాపాలు మొదలయ్యాయి. ఉద్యోగుల కోసం సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. మొబైల్‌ ఫోన్‌ కంపెనీలు కార్యకలాపాలు  తిరిగి  ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడాన్ని స్వాగతిస్తున్నామని, కార్మికుల  కొరత, సామగ్రి  లభ్యత ఆలస్యంకారణంగా  కొంత సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ  ఉత్పత్తి వేగాన్ని పెంచే సామర్ధ్యం తమ కంపెనీకి ఉన్నదని లావా చీఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫీసర్‌ సంజీవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కంపెనీ వెలుపల, బయట ఉద్యోగులు భౌతిక దూరం పాటించేలా చూడటం, పరిశుభ్రత పాటించడం వంటి చర్యలు తీసుకొనేలా ప్రోత్సహిస్తున్నట్టు సంస్థ పేర్కొన్నది. గ్రేటర్‌ నోయిడాలోని శామ్సంగ్‌, వివో, ఒప్పో, రియల్‌మీ వంటి అన్ని ప్రధాన స్మార్ట్‌ ఫోన్ల తయారీకంపెనీలు శుక్రవారం నుంచి పరిమిత కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాయి.


logo