శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 03, 2021 , 17:07:38

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఏ బ్యాంక్ వ‌డ్డీ రేటు ఎంత‌?

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఏ బ్యాంక్ వ‌డ్డీ రేటు ఎంత‌?

న్యూఢిల్లీ:  ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఒక్కో బ్యాంకు ఒక్కో వ‌డ్డీ రేటు ఇస్తుంది. అందులోనూ సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక రేటు, వృద్ధుల‌కు మ‌రో రేటు ఇచ్చే బ్యాంకులు కూడా ఉన్నాయి. చాలా వ‌ర‌కు బ్యాంకులు 7 నుంచి 7.5 శాతం వ‌డ్డీ ఇస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి బ్యాంక్‌లు క‌నీసం ఏడు రోజుల నుంచి ప‌దేళ్ల వ‌ర‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఇలాంటి వ‌డ్డీలు ఇస్తుంటాయి. కొన్ని చిన్న బ్యాంకులు వృద్ధుల‌కు 8 శాతం వ‌ర‌కూ వ‌డ్డీ రేట్లు ఇస్తుంటాయి. అయితే గ‌తేడాది క‌రోనా కార‌ణంగా చాలా వ‌ర‌కూ బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించేశాయి. ప్ర‌భుత్వ విధానాలు, ఆర్థిక ప‌రిస్థితులు, ద్ర‌వ్య ల‌భ్య‌త‌ను బ‌ట్టి ఈ వ‌డ్డీరేట్లు మారుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం ఏ బ్యాంకు ఎంత వ‌డ్డీ రేటు ఇస్తుందో ఇక్క‌డ చూడండి. 

ఏ బ్యాంక్ ఎంత‌?

బ‌జాజ్ ఫైనాన్స్‌:  సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల‌కు 6.1 శాతం నుంచి 6.6 శాతం. 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు 6.35 శాతం నుంచి 6.85 శాతం. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల ప‌రిమితి క‌నీసం 12 నెల‌ల నుంచి 60 నెల‌ల వ‌ర‌కు.

ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్‌: సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల‌కు 6.00 శాతం నుంచి 6.5 శాతం. 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు 6.25 శాతం నుంచి 6.75 శాతం. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల ప‌రిమితి క‌నీసం 12 నెల‌ల నుంచి 120 నెల‌ల వ‌ర‌కు.

పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్‌: సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల‌కు 5.90 శాతం నుంచి 6.7 శాతం. 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు 6.15 శాతం నుంచి 6.95 శాతం. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల ప‌రిమితి క‌నీసం 12 నెల‌ల నుంచి 120 నెల‌ల వ‌ర‌కు.

హెచ్‌డీఎఫ్‌సీ: సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల‌కు 5.85 శాతం నుంచి 6.25 శాతం. 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు 6.10 శాతం నుంచి 6.5 శాతం. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల ప‌రిమితి క‌నీసం 33 నెల‌ల నుంచి 66 నెల‌ల వ‌ర‌కు.

ఎస్‌బీఐ: సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల‌కు 2.90 శాతం నుంచి 5.4 శాతం. 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు 3.40 శాతం నుంచి 6.20 శాతం. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల ప‌రిమితి క‌నీసం 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల‌ వ‌ర‌కు.

ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌: సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల‌కు 2.75 శాతం నుంచి 6.00 శాతం. 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు 3.25 శాతం నుంచి 6.50 శాతం. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల ప‌రిమితి క‌నీసం 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల‌ వ‌ర‌కు.

యాక్సిస్ బ్యాంక్‌: సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల‌కు 2.50 శాతం నుంచి 5.50 శాతం. 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు 2.5 శాతం నుంచి 6.05 శాతం. ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల ప‌రిమితి క‌నీసం 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల‌ వ‌ర‌కు.


ఇవి కూడా చ‌ద‌వండి

కొవిషీల్డ్ వ‌ర్సెస్ కొవాగ్జిన్‌.. ఏ వ్యాక్సిన్ ధర ఎంత‌?

వ్యాక్సిన్ వ‌చ్చేసింది.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ల‌కు డీసీజీఐ అనుమ‌తి

ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ డౌటే!

దర్శక నిర్మాతలకు థియేటర్లపై ఇంకా నమ్మకం కుదరలేదా..?

VIDEOS

logo