e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News టెస్లా ఎంట్రీతోనే ఎల‌క్ట్రిక్ కార్లు.. ల‌గ్జ‌రీ సెగ్మెంట్ గ్రోత్‌

టెస్లా ఎంట్రీతోనే ఎల‌క్ట్రిక్ కార్లు.. ల‌గ్జ‌రీ సెగ్మెంట్ గ్రోత్‌

టెస్లా ఎంట్రీతోనే ఎల‌క్ట్రిక్ కార్లు.. ల‌గ్జ‌రీ సెగ్మెంట్ గ్రోత్‌

న్యూఢిల్లీ: క‌రోనా అనంత‌రం ఇండియ‌న్లు ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. అందునా అధిక విలువ‌, హయ్య‌ర్ స్పెసిఫికేష‌న్ కార్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. ప్యాసింజ‌ర్ కార్ల కొనుగోళ్ల విభాగంలో భార‌త్ మూడో స్థానానికి చేరుకోనున్న‌ది. క‌రోనా అనంత‌రం కార్ల క్ర‌య, విక్ర‌యాల‌పై ఒక ప్ర‌ముఖ ఆంగ్ల టీవీ చానెల్ నిర్వ‌హించిన చ‌ర్చాగోష్టిలో ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం, ర‌వాణా స‌మ‌స్య‌లు, స్థానిక లాక్‌డౌన్లు తాత్కాలిక అంశాలుగా నిలుస్తాయి. పెరుగుతున్న ఆదాయాలు, కేంద్రం అమ‌లులోకి తెచ్చిన స్క్రాపేజీ పాల‌సీ వినియోగ‌దారుల డిమాండ్ పెర‌గ‌డంలో కీల‌కం కానున్నాయి.

తాజాగా క‌రోనా రెండోవేవ్ ప్ర‌భావంతో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో అన్ని కార్ల షోరూమ్‌లు మూసేశారు. అయినా ఆటో ఇండ‌స్ట్రీ మాత్రం విక్ర‌యాల్లో పురోగ‌తి న‌మోద‌వుతుంద‌ని ఆశాభావంతో ఉంది. చిప్‌ల కొర‌త స‌మ‌స్య త్వ‌ర‌లో ప‌రిష్కారం అవుతుంద‌ని ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాలు అంచ‌నా వేస్తున్నాయి.

టెస్లా రంగ ప్ర‌వేశం భార‌త‌దేశంలో విద్యుత్ వాహ‌నాలకు మైలురాయి కానున్న‌ది. టెస్లా ఎంట్రీ ఇత‌ర ఆటోమొబైల్ సంస్థ‌ల ప్ర‌భావం త‌గ్గుతుంది. అయితే ఆటోమొబైల్ సంస్థ‌ల్లో ఇప్ప‌టికీ కాన్ఫిడెన్స్ భారీగా ఉంది.

క‌రోనా అనంత‌రం ప‌ర్స‌న‌ల్ మొబిలిటీ ముఖ్యం కావ‌డంతోపాటు సిస్ట‌మాటిక్‌గా మారింది. అత్య‌ధిక కార్ల కొనుగోలుదారులు స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌ల‌కు బ‌దులు ఎస్‌యూవీ మోడ‌ళ్ల కొనుగోలుకు మొగ్గుతున్నారు.

కొనుగోలుదారులు వాల్యూ చైన్‌వైపు షిప్ట్ అవ‌డంతో మార్కెట్ షేర్ మారుతుంది. ఇప్ప‌టికి విలాస కార్ల కొనుగోళ్లు 1.5 శాతం అయినా.. ఈ విభాగంలో గ్రోత్ న‌మోద‌వుతుంద‌న్న అంచ‌నాలు ఇప్ప‌టికీ ఉన్నాయి.

గ‌తేడాది ఆర్డ‌ర్లు లేక గంద‌ర‌గోళంలో చిక్కుకున్న ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా పుంజుకుంది. అయితే కొవిడ్‌-19తోపాటు సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త ఆటో రంగం ముందున్న స‌మ‌స్య‌లుగా భావిస్తున్నారు. వ‌చ్చే ఐదేండ్ల‌లో కార్ల సేల్స్‌లో డ‌బుల్ డిజిట్ గ్రోత్ న‌మోద‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌ల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా లాక్‌డౌన్‌కు సిద్ధం అవుతున్నా.. ఆన్‌లైన్ ఎంక్వైరీలు వేగం పుంజుకున్నాయి. దేశంలో టెస్లా ఎంట్రీతో విద్యుత్ వాహ‌నాల మార్కెట్‌పై ఆస‌క్తి పెరుగ‌నున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డు@62,377 డాల‌ర్లు!

తెలుగు ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ఉగాది శుభాకాంక్ష‌లు

ఇదెక్క‌డి పోయేకాలం.. యువ‌కుడి జ‌న‌నాంగం కోసేసిన‌ న‌పుంస‌కులు..!

దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు

‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్న‌ల్‌

రెండు కాళ్లు, మూడు చేతుల‌తో.. ఒడిశాలో జ‌న్మించిన అవిభ‌క్త క‌వ‌ల‌లు

రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు

ఎఫ్ 3 చిత్రంలో వ‌కీల్ సాబ్ బ్యూటీ..!

IPL 2021:టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

IPL 2021:టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

సెప్టెంబ‌ర్ నాటికి ముగియ‌నున్న ఎయిర్ ఇండియా అమ్మకం..?!

బాయ్‌ఫ్రెండ్‌తో ఐరాఖాన్ బాక్సింగ్‌..వీడియో వైర‌ల్

కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డ‌బ్ల్యూహెచ్ఓ

అంత త‌క్కువ ధ‌ర‌కు మా వ్యాక్సిన్ అమ్మ‌లేం: ఆర్డీఐఎఫ్‌

Advertisement
టెస్లా ఎంట్రీతోనే ఎల‌క్ట్రిక్ కార్లు.. ల‌గ్జ‌రీ సెగ్మెంట్ గ్రోత్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement