శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 02, 2020 , 13:30:49

లాంబోర్గినీ లగ్జరీ యాచ‌ట్‌..రూ.25 కోట్లు

లాంబోర్గినీ లగ్జరీ యాచ‌ట్‌..రూ.25 కోట్లు

న్యూఢిల్లీ:  ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ  లాంబోర్గినీ  యాచట్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఇటాలియన్‌ సూపర్‌ కార్ల కంపెనీ తన లగ్జరీ యాచట్‌ను తాజాగా లాంచ్‌ చేసింది.  'టెక్నోమార్‌ ఫర్‌ లాంబోర్గినీ 63' పేరుతో విలాసవంతమైన స్పీడ్‌బోట్‌ను  డిజైన్‌ చేసినట్లు  కంపెనీ పేర్కొంది. లాంబోర్గినీ కంపెనీ 1963లో ఏర్పాటైన నేపథ్యంలో కొత్త యాచట్‌ పేరులో 63 సంఖ్యను జతచేసింది.

 బోట్‌ బిల్డర్‌ ఇటాలియన్‌ సీ గ్రూప్‌తో భాగస్వామ్యంతో లాంబోర్గినీ బోట్‌ను రూపొందించింది. కార్బన్‌ ఫైబర్‌తో తయారు చేసిన బోట్‌ బరువు 24 టన్నులు కాగా, 63 అడుగుల పొడవు, 18 అడుగులు వెడల్పు ఉంటుంది.  గంటకు 69మైళ్ల వేగంతో దూసుకెళ్లే  లగ్జరీ యాచట్‌ ధర రూ.25కోట్లు. లాంబోర్గినీ 63 యాచట్‌లను 2021 నుంచి విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo