గురువారం 04 మార్చి 2021
Business - Jan 08, 2021 , 01:44:05

ఏపీలో లలితా జ్యూవెల్లరీ రెండు షోరూంలు

ఏపీలో లలితా జ్యూవెల్లరీ రెండు షోరూంలు

హైదరాబాద్‌, జనవరి 7: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యూవెల్లరీ..ఆంధ్రప్రదేశ్‌లో ఒకేరోజు రెండు షోరూంలను ప్రారంభించబోతున్నది. శనివారం శ్రీకాకుళం, గోపాలపట్నంలో ఏర్పాటు చేసిన షోరూంలను ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, వైజాగ్‌ ఎంపీ సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు. దీంతో సంస్థ షోరూంల సంఖ్య 31కి చేరుకోనున్నది. శ్రీకాకుళం, గోపాలపట్నం ప్రాంత ప్రజలకు మరింత చేరువకావలనే ఉద్దేశంలో ఈ షోరూంలను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ సీఎండీ కిరణ్‌ కుమార్‌ తెలిపారు.  

VIDEOS

logo