శనివారం 30 మే 2020
Business - Mar 30, 2020 , 14:59:27

ఎల్‌ అండ్‌ టీ పెద్ద మనసు..రూ.150 కోట్ల విరాళం

ఎల్‌ అండ్‌ టీ పెద్ద మనసు..రూ.150 కోట్ల విరాళం

ముంబై:  కరోనా వైరస్‌(కోవిడ్‌-19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రముఖ ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్చన్‌ కంపెనీ  ఎల్‌ అండ్‌ టీ ప్రధాన మంత్రి సహాయనిధి(పీఎం కేర్స్‌ ఫండ్‌)కి రూ.150 కోట్ల విరాళం ప్రకటించింది.  తమ సంస్థలో పనిచేస్తున్న  సుమారు 1.60లక్షల మంది కాంట్రాక్టు  ఉద్యోగులకు సాయం చేసేందుకు నెలకు రూ.500కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది.  కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా టాటా గ్రూప్‌, జేఎస్‌డబ్ల్యూ, అదానీ గ్రూప్‌, రిలయన్స్‌ సంస్థలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు వర్కర్లకు వేతనాలు చెల్లిస్తామని, లేబర్ క్యాంప్‌ల దగ్గర భోజనం అందించడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని ఎల్‌ అండ్‌ టీ వెల్లడించింది. కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు నియంత్రణ చర్యలతో పాటు సామాజికి దూరాన్ని పాటిస్తున్నట్లు వివరించింది.  పీఎం కేర్స్‌ ఫండ్‌కి సాయం చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు విరాళాన్ని ప్రకటించామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 


logo