బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 15, 2020 , 20:04:05

ఎల్‌అండ్‌టీ లాభం 2,560 కోట్లు

ఎల్‌అండ్‌టీ లాభం 2,560 కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,560 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి ఆర్జించిన రూ.2,218.68 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయంలో భారీ వృద్ధి నమోదుకావడం లాభాలు పుంజుకోవడానికి దోహద పడ్డాయి. గతేడాది రూ.34,823.08 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.36,717.60 కోట్లకు చేరుకోగా..అటు నిర్వహణ ఖర్చులు కూడా రూ.31,421.86 కోట్ల నుంచి రూ.33,494.37 కోట్లకు పెరిగినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. వ్యాపార రంగంలో నెలకొన్న మందకొడి పరిస్థితుల కారణంగా గడిచిన మూడు నెలల్లో సంస్థ రూ.41,579 కోట్ల విలువైన నూతన ఆర్డర్లను మాత్రమే దక్కించుకోగలిగింది. వీటిలో అంతర్జాతీయ దేశాల నుంచి రూ.17,901 కోట్లు ఉన్నాయి. మొత్తం ఆర్డర్లలో వీటి వాటా 43 శాతంగా ఉన్నది. వీటిలో పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌, మెటలాజికల్‌, మెటిరియల్‌ వ్యాపార రంగాల నుంచి వచ్చినట్లు తెలిపింది. దీంతో డిసెంబర్‌ 31, 2019 నాటికి కంపెనీ చేతిలో రూ.3,06,280 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.  logo
>>>>>>