e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home News చౌక‌గానే కొట‌క్ ఇంటి రుణాలు.. వ‌డ్డీ ఎంతంటే!

చౌక‌గానే కొట‌క్ ఇంటి రుణాలు.. వ‌డ్డీ ఎంతంటే!

చౌక‌గానే కొట‌క్ ఇంటి రుణాలు.. వ‌డ్డీ ఎంతంటే!

ముంబై: సొంతింటి క‌ల నిజం చేసుకోవాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.. ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌.. స్పెష‌ల్ వ‌డ్డీరేటుపై హోంలోన్ల‌ను కొన‌సాగిస్తామ‌ని సోమ‌వారం ప్ర‌క‌టించింది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం గ‌త నెలాఖ‌రు వ‌ర‌కు 6.65 శాతం వ‌డ్డీరేటుపై ఇంటి రుణాలిస్తామ‌ని ఇంత‌కుముందు ప్ర‌క‌టించింది.

కొత్త‌గా రుణాలు తీసుకునే వారికి.. ఇప్ప‌టికే రుణాలు తీసుకున్న వారి బ్యాలెన్స్ రుణ బ‌కాయిలను బ‌దిలీ చేసే రుణ గ్ర‌హీత‌ల‌కు ఈ విధానం కొన‌సాగ‌నున్న‌ది. ఈ సంగ‌తి కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ క‌న్జూమ‌ర్ అసెట్స్ విభాగం ప్రెసిడెంట్ అంబూజ్ చంద్నా చెప్పారు.

ఇండ్ల‌ను కొనుగోలు చేయాల‌ని ఆస‌క్తితో ఉన్న వారి ప‌క్షాన నిల‌బ‌డాల‌ని నిర్ణ‌యించామ‌ని అంబూజ్ చంద్నా తెలిపారు. వ‌డ్డీరేట్లు భారీగా త‌గ్గ‌డంతో ఇటీవ‌ల కొన్ని నెల‌లుగా ఇండ్ల విక్ర‌యాల్లో మెరుగైన పురోగ‌తి న‌మోదైంది.

క‌రోనా మ‌హ‌మ్మారి నేపథ్యంలో వివిధ రంగాల్లో వ‌ర్క్ ఫ్రం హోం క‌ల్చ‌ర్ ప్రారంభం కావ‌డంతో ఇండ్ల కొనుగోళ్ల‌కు డిమాండ్ పెరిగింది. ఇండ్లు కొనుగోలు చేయాల‌ని కోరుకునే వారి ప‌క్షాన నిలుస్తూ 6.65 శాతం వ‌డ్డీపై హోంలోన్ అందిస్తామ‌ని తెలిపారు.

క‌రోనా వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ కీల‌క రెపోరేట్ భారీగా త‌గ్గించింది. దీంతో ఇండ్ల రుణాల‌పై వ‌డ్డీరేటు 15 ఏండ్ల దిగువ‌కు ప‌డిపోయాయి. ఇది చౌక‌గా ఇండ్ల కొనుగోలుకు మార్గం సుగ‌మం చేసింది.

గ‌తేడాది డిసెంబ‌ర్ నాటికి కొట‌క్ మ‌హీంద్రా ఇంటి రుణాలు, ఆస్తికి వ్య‌తిరేకంగా రుణాలు (ఎల్ఏపీ) రూ.49,977 కోట్ల‌కు చేరాయి. అన్ని ర‌కాల క‌న్జూమ‌ర్ అసెట్స్‌లో ఇంటి రుణాల వాటా 22 శాతంగా ఉంది.

ఇదిలా ఉంటే దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ సైతం గ‌త నెల‌లో 6.7 శాతానికి హోంలోన్లు త‌గ్గించింది. కానీ ఈ నెల ప్రారంభం నుంచి 6.95 శాతం వ‌డ్డీ రుణాల విధానాన్ని పున‌రుద్ధ‌రించింది.

ఫిబ్ర‌వ‌రిలో ఎస్బీఐ హోంలోన్లు రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయి. గ‌తేడాది డిసెంబ‌ర్ నాటికి అది రూ.4.84 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే. మొత్తం వాణిజ్య బ్యాంకుల రుణాల్లో ఎస్బీఐ వాటా 35 శాతం. ఎస్బీఐ ఇంటి రుణాలు 2020 డిసెంబ‌ర్‌తో పోలిస్తే 23 శాతం ఎక్కువ‌.

ఇవి కూడా చ‌ద‌వండి:

క‌రోనా క‌ల్లోలం.. ఇండియాలో కొత్త‌గా 1.69 ల‌క్ష‌ల కేసులు

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బాఫ్టా అవార్డ్ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక చోప్రా, నిక్

సెకండ్ వేవ్‌.. ధారావి మ‌ళ్లీ విజేత‌గా నిలుస్తుందా ?

క‌రోనా ఎఫెక్ట్‌: అక్క‌డ 18 జిల్లాల్లో లాక్‌డౌన్

హ‌రిద్వార్‌లో నిరంజ‌ని సాధ‌వుల పుణ్య స్నానాలు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బెడ్ల కొర‌త‌.. వీల్ చైర్ల‌పైనే రోగుల‌కు చికిత్స‌

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై రూ.40వేల తగ్గింపు

రూ.46 వేల‌కు పైనే ప‌సిడి ధ‌ర

బంగారం షాపుల్లో రద్దీ

క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్‌.. అప్లై ఎలా చేయాలంటే..

తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..

Advertisement
చౌక‌గానే కొట‌క్ ఇంటి రుణాలు.. వ‌డ్డీ ఎంతంటే!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement