సోమవారం 01 మార్చి 2021
Business - Dec 22, 2020 , 00:14:26

కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఎండీకి ఊరట

కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఎండీకి ఊరట

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఉదయ్‌ కోటక్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ కోర్టులో విచారణలో ఉన్న ఓ చీటింగ్‌ కేసుపై హైకోర్టు స్టే విధించింది. ఓ రుణ ఖాతాకు సంబంధించి మాగ్మా ఫిన్‌కార్ప్‌ రికవరీ బాధ్యతలు చేపట్టింది. తర్వాత మాగ్మా ఖాతాలను కోటక్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది. దీంతో కోటక్‌ బ్యాంక్‌ ఎండీ పేరును కేసులో ప్రతివాదిగా చేర్చారు. సంబంధం లేని కేసులో కోటక్‌ బ్యాంక్‌ ఎండీ పేరును చేర్చారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. వివరాలు నమోదు చేసుకున్న హైకోర్టు.. దిగువ కోర్టు విచారణపై స్టే విధించింది.


VIDEOS

logo