ఆదివారం 31 మే 2020
Business - May 07, 2020 , 15:54:51

కోటక్‌ బ్యాంకు ఉద్యోగుల జీతాల్లో కోత

కోటక్‌ బ్యాంకు ఉద్యోగుల జీతాల్లో కోత

ముంబై: కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్ని రోజులుగా ఎలాంటి లావాదేవీలు జరుగకుండా పలు వ్యాపార, వాణిజ్యసంస్థలు ఉండిపోయాయి. వీటిలో అన్నిరకాల బ్యాంకులు కూడా ఉన్నాయి. గత 45 రోజులుగా బ్యాంకుల వంటి ఆర్థిక సేవల సంస్థలను తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఒక్కో బ్యాంకు ఒక్కోరకం నిర్ణయం తీసుకొంటున్నాయి. 

కోటక్‌ మహీంద్రా బ్యాంకు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకొన్నది. ఏడాదికి రూ.25 లక్షలు, ఆపైన జీతాలు తీసుకొంటున్న ఉద్యోగుల జీతాల్లో నుంచి 10 శాతం మేర కోట పెడుతున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ నెల నుంచే అమలులోకి రానున్నది. పీఎం కేర్స్‌కు కోటక్‌ మహీంద్ర బ్యాంకు రూ.25 కోట్లు ప్రకటించింది. అలాగే, బ్యాంకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన ఉదయ్‌ కోటక్‌ మరో రూ.25 కోట్ల నిధి అందించేందుకు హామీ ఇచ్చారు.


logo