Kia Record in Seltos sales | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ అరుదైన రికార్డును నమోదు చేసింది. తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ మోడల్ కారు సెల్టోస్ విక్రయాల్లో కీలక మైలురాయిని దాటేసింది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన రెండేండ్లలోనే రెండు లక్షల సెల్టోస్ కార్లను విక్రయించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదే కాలంలో కనెక్టెడ్ కార్లు 1.5 లక్షల యూనిట్లను విక్రయించామన్నది.
దేశవ్యాప్తంగా కియా ఇండియా కార్ల సేల్స్‌లో సెల్టోస్ మోడల్ 66 శాతానికి పైగా వాటా కొట్టేసింది. మొత్తం కియా మోటార్స్ క్యుములేటివ్ సేల్స్ మూడు లక్షలు దాటాయి. మొత్తం సెల్టోస్ సేల్స్‌లో డీజిల్ పవర్ ట్రైన్ కలిగినవి 45 శాతం ఉన్నాయి. కియా మోటార్స్ టాప్ వేరియంట్స్‌లో సెల్టోస్ కార్లు 58 శాతం అమ్ముడైతే ఆటోమేటిక్ ఆప్షన్ గల కార్లు 35 శాతం పై మాటే.