గురువారం 09 ఏప్రిల్ 2020
Business - Feb 28, 2020 , 00:12:50

కియా కార్నివాల్‌ అదుర్స్‌

కియా కార్నివాల్‌ అదుర్స్‌
  • ఒకేరోజు పది కార్ల డెలివరీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: కియాకు చెందిన వాహనాలకు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇటీవల దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త లగ్జరీ ఎంపీవీ కార్నివాల్‌ను ఒకేరోజు పది మంది కస్టమర్లకు అందచేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.24.95 లక్షలుగా నిర్ణయించింది. మూడు రకాల్లో లభించనున్న  ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన వాహనం రూ.24.95 లక్షలు, ఎనిమిది సీట్లది రూ.25.15 లక్షలు, ఏడు సీట్లు కలిగిన ప్రీస్టేజ్‌ మోడల్‌ రూ.28.95 లక్షలు, తొమ్మిది సీట్లది రూ.29.95 లక్షలు, దీంతోపాటు ఏడుగురు కూర్చోవడానికి వీలుండే లిమౌసిన్‌ మోడల్‌ రూ.33.95 లక్షలకు లభించనున్నది. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ వాహనాన్ని 2.2 లీటర్ల వీజీటీ ఇంజిన్‌తో రూపొందించింది.logo