గురువారం 02 జూలై 2020
Business - May 28, 2020 , 22:03:30

మరో రూ.400 కోట్ల పెట్టుబడికి కియా సిద్ధం

మరో రూ.400 కోట్ల పెట్టుబడికి కియా సిద్ధం

అమరావతి: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా మోటర్స్‌.. ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకొనే పనిలో పడింది. అందుకోసం  మరో 54 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.400 కోట్లకు పైమాటే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వద్ద ఏర్పాటుచేసిన కార్ల ఉత్పత్తి ప్లాంట్‌ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు కియా మోటర్స్‌ ఇండియా సీఈవో కూఖ్యూన్‌ షిమ్‌ తెలిపారు. దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన 10 నెలల్లో భారీ విజయం సాధించామన్నారు.

అనంతపురం జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుచేయడానికి ఈ సంస్థ ఇదివరకే 1.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ యూనిట్‌ ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది. 536 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్‌లో యేటా 3 లక్షల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. 


logo