ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 10, 2021 , 03:18:52

కావేరీ సీడ్స్‌ లాభం 10% వృద్ధి

కావేరీ సీడ్స్‌ లాభం 10% వృద్ధి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9:  ప్రముఖ విత్తనాల సంస్థ కావేరీ సీడ్స్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.118.54 కోట్ల విక్రయాలపై రూ.9.11 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.121.98 కోట్ల విక్రయాలతో పోలిస్తే 3 శాతం తగ్గగా, రూ.8.25 కోట్ల నికర లాభంతో పోలిస్తే 10.30 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ జీవీ భాస్కర్‌ రావు మాట్లాడుతూ..మార్కెట్లోకి నూతన ఉత్పత్తులను విడుదల చేయడం ఆర్థిక ఫలితాల్లో వృద్ధికి కలిసొచ్చిందని, బియ్యం-హైబ్రిడ్‌ బియ్యం విభాగం బలమైన వృద్ధిని సాధించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో రూ.972 కోట్ల విక్రయాలపై రూ.327.86 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.455 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు తెలిపింది. 


VIDEOS

logo