గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 05, 2020 , 22:54:47

కావేరి సీడ్స్‌ లాభంలో భారీ వృద్ధి

కావేరి సీడ్స్‌ లాభంలో భారీ వృద్ధి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5: విత్తనాల తయారీ సంస్థ కావేరి సీడ్స్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.8.53 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.2.9 కోట్ల లాభంతో పోలిస్తే 193.28 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ విక్రయాలు రూ.84.77 కోట్ల నుంచి రూ.121.98 కోట్లకు చేరుకున్నాయి. నికరంగా 43.91 శాతం వృద్ధిని కనబరిచినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 


logo