న్యూఢిల్లీ: ఈనాడు ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు సాధారణం.. అయితే, ప్రతి ఖాతాదారు రోజువారీ సేవల కోసం బ్యాంకుకు వెళుతుంటారు.
వచ్చే నెలలో మొత్తం 15 రోజులూ సెలవు దినాలే.. వచ్చేనెల 10వ తేదీ నుంచి మూడు రోజులు వరుస సెలవులే.
మొత్తం సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాల్లో బ్యాంకులు పని చేయవు. బక్రీద్ కారణంగా 21వ తేదీన సెలవు..
కనుక బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునే వారు ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ చూసుకుని తమ శాఖలకు వెళ్లడం ఉత్తమంగా ఉంటుంది.
వచ్చే నెలలో ఏయే తేదీల్లో సెలవులు ఉన్నాయో ఒకసారి చూద్దాం..
జూలై నాలుగో తేదీన ఆదివారం.. 10న రెండో శనివారం, 11న ఆదివారం బ్యాంకులు మూసి ఉంటాయి. 12న రథయాత్ర ఫెస్టివల్. 13న కొభాను జయంతి, 14న దురుక్పా టెచి పండుగ ఉంటుంది.
16న హరేలా, 17న పూజలు, 18న ఆదివారం.. 19న గురు రిన్పొచే తుంగాకర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు. 20న బక్రీద్, 21న బక్రీద్ (ఈద్ ఉల్ ఆదా) సందర్భంగా బ్యాంకులు పని చేయవు.
24న నాలుగో శనివారం, 25న ఆదివారం, తిరిగి 31న కేర్ పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ కారణాల రీత్యా బ్యాంకులు మూసి ఉంటాయి.