సోమవారం 03 ఆగస్టు 2020
Business - Aug 01, 2020 , 03:30:57

జీఎమ్మార్‌కు జేఎస్‌డబ్ల్యూ షాక్‌

జీఎమ్మార్‌కు జేఎస్‌డబ్ల్యూ షాక్‌

న్యూఢిల్లీ, జూలై 31: సజ్జన్‌ జిందాల్‌ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ.. జీఎమ్మార్‌తో కుదుర్చుకున్న డీల్‌ను రద్దు చేసుకున్నది. రూ.5,321 కోట్లతో జీఎమ్మార్‌ కమలంగ ఎనర్జీని కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో జేఎస్‌డబ్ల్యూ ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ప్రకటించింది. ఇరు సంస్థలు ఈ డీల్‌ను నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ బీఎస్‌ఈకి తెలియజేసింది. జీఎమ్మార్‌ ఎనర్జీ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన జీఎమ్మార్‌ కమలంగ ఎనర్జీ.. ఒడిషాలో 1,050 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నది. 


logo