గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 06, 2020 , 00:42:56

సెలెక్ట్‌లో సామ్‌సంగ్‌ 5జీ ఫోన్లు

సెలెక్ట్‌లో సామ్‌సంగ్‌ 5జీ ఫోన్లు

హైదరాబాద్‌, మార్చి 5: ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ సెలెక్ట్‌లో సామ్‌సంగ్‌నకు చెందిన 5జీ ఆధారిత ఎస్‌20 సిరీస్‌ మొబైళ్లు లభించనున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సామ్‌సంగ్‌నకు చెందిన ఎస్‌20, ఎస్‌20 ప్లస్‌, ఎస్‌20 అల్ట్రా మోడళ్లను కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ వై గురు మాట్లాడుతూ..వినియోగదారులకు నూతన టెక్నాలజీతో తయారైన మొబైళ్లు అందించడంలో సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. 6.9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ కలిగిన ఈ గెలాక్సీ ఎస్‌20 అల్ట్రాలో 12జీబీ ర్యామ్‌, మూడు కెమెరాలు, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి.


logo