Business
- Jun 06, 2020 , 01:16:45
ఆకట్టుకున్న బ్యాంకింగ్ షేర్లు

- మళ్లీ లాభాల్లోకి స్టాక్ మార్కెటు ్ల
ముంబై, జూన్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. వరుస లాభాల్లో ఉన్న సూచీలు గురువారం నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపరులను బ్యాంకింగ్ షేర్లు ఆకట్టుకోవడంతో మార్కెట్లు తిరిగి లాభాలను సంతరించుకున్నాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 306.54 పాయింట్లు లేదా 0.90 శాతం పుంజుకుని 34,287.24 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 113.05 పాయింట్లు లేదా 1.13 శాతం కోలుకుని 10,142.15 వద్ద స్థిరపడింది. బ్యాం కింగ్, మౌలిక, మెటల్, టెలికం, బేసిక్ మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, విద్యుత్ రంగాల సూచీలు 3.86 శాతం వరకు పెరిగాయి. ఎస్బీఐ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల షేర్ల విలువ 8 శాతం వరకు ఎగబాకింది.
తాజావార్తలు
- అక్కా వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త
- ఈ రాశుల వారికి.. వ్యయ, ప్రయాసలు అధికం!
- 28 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు
- టీకా ఇచ్చి అభయం కల్పించి..
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
MOST READ
TRENDING