శనివారం 30 మే 2020
Business - Apr 24, 2020 , 00:09:36

జోయాలుక్కాస్‌ ఆన్‌లైన్‌ అమ్మకాలు

జోయాలుక్కాస్‌ ఆన్‌లైన్‌ అమ్మకాలు

హైదరాబాద్‌: జోయాలుక్కాస్‌.. ఆన్‌లైన్‌ అమ్మకాలను ప్రారంభించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్షయ తృతీయను పురస్కరించుకుని తమ కస్టమర్ల కోసం ఆన్‌లైన్‌ విక్రయాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. శని, ఆదివారాల్లో జోయాలుక్కాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా తమ ఇండ్ల నుంచే బంగారాన్ని, నచ్చిన నగలను కొనుగోలు చేయవచ్చని వివరించింది. బంగారు ఆభరణాలపై ప్రతీ గ్రాముకు రూ.50, వజ్రాభరణాలపై డైమండ్‌ విలువలో 20 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని స్పష్టం చేసింది. ఎస్బీఐ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 15 శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. అమెజాన్‌, woohoo.in మొదలైన ఆన్‌లైన్‌ సైట్స్‌ ద్వారా కొనుగోళ్లు జరిపిన కస్టమర్లకు ప్రత్యేక బహుమతి వోచర్లు, ఈ-వోచర్లు అందుతాయన్నది. logo