మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 05, 2021 , 02:29:51

మరో 1,500 మందికి ఉద్యోగాలు

మరో 1,500 మందికి ఉద్యోగాలు

నిస్సాన్‌ మోటర్‌ ఇండియా ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 4: భారత్‌లో తమ వాహన ఉత్పత్తులను, అమ్మకాలను మరింత పెంచుకునేందుకు డీలర్లతో కలిసి కొత్తగా 1,500 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్‌ ప్రకటించింది. గత నెల 2న మార్కెట్లో ప్రవేశపెట్టిన మాగ్నైట్‌ ఎస్‌యూవీకి కొనుగోలుదారుల నుంచి విస్తృత స్పందన లభించడంతో ఇప్పటివరకు దాదాపు 32,800 బుకింగ్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో వెయిటింగ్‌ పీరియడ్‌ను నెలల తరబడి సాగదీయాల్సి వస్తుండటంతో అదనపు సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్తగా తీసుకునే ఉద్యోగుల్లో దాదాపు 1,000 మందిని చెన్నై ప్లాంట్‌లోనూ, మరో 500 మందిని కంపెనీ డీలర్‌షిప్పుల్లోనూ నియమించనున్నట్లు తెలిపింది.


VIDEOS

logo