బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 15, 2020 , 14:57:26

జియో మ‌రో విప్ల‌వం.. వ‌చ్చే ఏడాది నుంచి 5జీ సేవ‌లు

జియో మ‌రో విప్ల‌వం..  వ‌చ్చే ఏడాది నుంచి 5జీ సేవ‌లు

హైద‌రాబాద్‌: రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన జియో దూసుకువెళ్తున్న‌ది. దేశీయ డిజిట‌ల్ రంగంలో మ‌రో విప్ల‌వానికి జియో తెర‌లేప‌నున్న‌ది. వ‌చ్చే ఏడాది నుంచి జియోలో 5జీ సేవ‌లు క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు ముఖేశ్ అంబానీ తెలిపారు.  ఇవాళ  ఆర్ఐఎల్ ఏజీఎం స‌మావేశాన్ని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు.  ఈ సంద‌ర్భంగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారైన 5జీ సేవ‌ల‌ను మొబైల్ రంగంలో అందుబాటులోకి తేనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. జియో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్ప‌టికే భార‌తీయుల‌కు 500 కోట్ల జీబీ డేటాను ఇచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 

5జీకి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఇవాళ ముఖేశ్ అంబానీ రిలీజ్ చేశారు.  ప్ర‌పంచ స్థాయికి త‌గ్గ 5జీ టెక్నాల‌జీని భార‌త్ అభివృధ్ధి ప‌రిచిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే వినియోగ‌దారుల‌కు 2021 నుంచి ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇత‌ర దేశాల‌కు కూడా జియో 5జీ సేవ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు ముఖేశ్ వెల్ల‌డించారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌కు ఇది ఊతం ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు.  భార‌త్‌లో త‌యారైన టెక్నాల‌జీ సేవ‌ల‌న్నీ ప్ర‌పంచ దేశాల‌కు అందాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. జియో క‌స్ట‌మ‌ర్లు అంద‌రూ 5జీ సేవ‌లు పొందే విధంగా త‌మ నెట్వ‌ర్క్ ఉంద‌న్నారు. జియో 5జీతో.. వ్య‌వ‌సాయం, ఆరోగ్యం, డిజిట‌ల్ లైఫ్‌స్ట‌యిల్‌లో భారీ మార్పులో జ‌ర‌గ‌నున్న‌ట్లు ముఖేశ్ తెలిపారు.
logo