బుధవారం 03 మార్చి 2021
Business - Jan 19, 2021 , 00:05:07

వాట్సాప్‌లో జియో మార్ట్‌

వాట్సాప్‌లో జియో మార్ట్‌

న్యూఢిల్లీ, జనవరి 18: దేశీయ ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌లో భారీ వాటాను చేజిక్కించుకునేందుకు రిలయన్స్‌ రిటైల్‌ కసరత్తు చేస్తున్నది. వ్యాపార విస్తరణలో భాగంగా రానున్న ఆరు నెలల్లో తన జియో మార్ట్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకురానున్నది. తద్వారా 40 కోట్ల మంది వాట్సాప్‌ వినియోగదారులకు చేరువ కావడంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజాలకు పోటీగా నిలవాలని జియో మార్ట్‌ భావిస్తున్నది. గతేడాది మే నెలలో ప్రారంభమైన జియో మార్ట్‌.. ప్రస్తుతం 200 నగరాల్లో సేవలందిస్తున్నది. గతేడాది వాట్సాప్‌ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌కు 9.9 శాతం వాటా అమ్మేందుకు 5.7 బిలియన్‌ డాలర్ల (రూ.41,764 కోట్ల)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న రిలయన్స్‌ రిటైల్‌.. ఆ తర్వాత కొద్ది రోజులకే జియో మార్ట్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వాట్సాప్‌ ద్వారా జియో మార్ట్‌ అందిస్తున్న సేవలు కేవలం ముంబైకి మాత్రమే పరిమితమయ్యాయి. ఇకపై ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు రిలయన్స్‌ రిటైల్‌ ముమ్మర ప్రయతాలు చేస్తున్నది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని కిరాణా దుకాణాలను జియో మార్ట్‌తో అనుసంధానించే ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టింది. 

VIDEOS

logo