నేటి నుంచి మళ్లీ జియో ఉచిత కాల్స్

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్లకు నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. కొత్త సంవత్సరంలో మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై జియో కస్టమర్లు దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జి (ఐయూసీ) విధానం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది. ‘ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత కాల్స్‌ను పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడే ఉన్నాం. 2021 జనవరి 1 నుంచి జియో వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు’ అని రిలయన్స్ జియో గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా తమ అన్లిమిటెడ్ ప్యాక్ యూజర్లకు జనవరి 1 నుంచి ఉచితంగా వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేయనున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- కొవాగ్జిన్ సామర్థ్యం.. 81%
- ‘రాసలీలల’ మంత్రి రాజీనామా
- ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు
- 24/7 వ్యాక్సినేషన్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్
- సోషల్ మీడియా నియంత్రణపై రాష్ర్టాలకు అధికారం లేదు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- వెన్నునొప్పి ఉంది.. గుర్రం మీదొస్తా !
- జనాభాలో వాళ్ల వాటా 19.. సంక్షేమ పథకాల్లో 35 శాతం