గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 24, 2020 , 07:28:00

నూతన కస్టమర్లకు జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఫ్రీ

నూతన కస్టమర్లకు జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఫ్రీ

ముంబయి: నూతన బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రకటించగా..పాత వినియోగదారులకు డాటా పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేసేవారికి ప్రయోజనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్‌ కనెక్షన్‌ పొందడానికి రూ.2,500 చెల్లించాల్సి ఉండగా, వీటిలో రూ.1,500 రిఫండ్‌ కింద పొందనున్నారు. మినిమమ్‌ రీఫండబుల్‌ డిపాజిట్‌ తీసుకుని హోం గేట్‌వే రూటర్‌ను అందిస్తున్నారు.

కంపనీ డాటా ఆడ్‌ ఆన్‌ ఓచర్లపై డబుల్‌ డాటాను అందిస్తుంది. నాన్‌ జియో వాయిస్‌ కాల్స్‌పై కూడా నిమిషాలను పెంచింది. కస్టమర్లు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కోసం ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కనెక్షన్లకు ఫ్రీ బ్రాడ్‌ బాండ్‌ ప్లాన్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది.   దేశవ్యాప్తంగా ఉన్న 746 గ్రాసరీ స్టోర్లలో అన్ని రకాల వస్తువులను సిద్ధంగా ఉంచినట్లు, ఇవి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచివుంచనున్నట్లు వెల్లడించింది. 
logo
>>>>>>