శనివారం 06 జూన్ 2020
Business - May 16, 2020 , 02:44:24

1జీబీ డాటా రూ.4కే

1జీబీ డాటా రూ.4కే

  • జియో నుంచి సరికొత్త త్రైమాసిక ప్లాన్‌
  • రూ.999తో రోజుకు 3 జీబీ డాటా లభ్యం

న్యూఢిల్లీ, మే 15: ఇంటర్నెట్‌ డాటాను అధికంగా ఉపయోగించే వినియోగదారుల కోసం రూ.999 ధరతో సరికొత్త ‘వర్క్‌ ఫ్రం హోం’ ప్లాన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు రిలయన్స్‌ జియో శుక్రవారం ప్రకటించింది. 84 రోజులపాటు చెల్లుబాటయ్యే ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజూ 3జీబీ చొప్పున డాటా, 100 ఎస్‌ఎంఎస్‌లతోపాటు జియో నుంచి జియో నంబర్లకు, జియో నుంచి ల్యాండ్‌లైన్‌ నంబర్లకు ఉచితంగా అపరిమిత వాయిస్‌కాల్స్‌ను అందజేయనున్నట్టు తెలిపింది. అంటే ఈ ప్లాన్‌లో 1 జీబీ డాటా దాదాపు రూ.4కే లభిస్తుంది. 


logo