బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 21, 2020 , 22:39:34

ఒక్క‌రోజులో రూ.97 వేల కోట్ల ఆర్జ‌న‌!

ఒక్క‌రోజులో రూ.97 వేల కోట్ల ఆర్జ‌న‌!

ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కేవలం ఒక్కరోజులోనే రూ.97 వేల కోట్ల (13 బిలియన్ డాలర్లు) లాభాలను ఆర్జించారు. ఒక్కరోజులో ఇంత మొత్తంలో సంపాదించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2012లో బ్లూంబ‌ర్గ్ బిలియనీర్స్‌ ఇండెక్స్ మొదలైన తర్వాత ఒకరి వ్యక్తిగత సంపాదన ఒక్క‌రోజులోనే ఈ మేరకు ఎగబాకడం ఇదే మొదటిసారట‌. 

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ షేర్లు 7.9 శాతం మేర లాభాల్లో దూసుకెళ్లాయి. దీంతో ఇప్పటికే ప్రపంచ నెంబర్ వన్ బిలియనీర్‌గా కొనసాగుతున్న 56 ఏండ్ల‌ బెజోస్ సంపద తాజాగా 189.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన సంపద 74 బిలియన్ డాలర్ల మేర పెరగింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo