గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 18, 2021 , 17:48:03

జాగ్వార్‌లో రెండు వేల మంది ఇంటికే?!

జాగ్వార్‌లో రెండు వేల మంది ఇంటికే?!

న్యూఢిల్లీ: ‌టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ అండ్ లాండ్ రోవ‌ర్ (జేఎల్ఆర్‌) పొదుపు చ‌ర్య‌లు ప్రారంభించింది. అందులో భాగంగా ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండు వేల మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లుకాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యం ప్ర‌కారం ఇంగ్లండ్‌లోని మిడ్‌ల్యాండ్స్ ఏరియా, స్లోవేకియా, భార‌త్‌, చైనా, బ్రెజి్ల్‌ల‌లోని ఉత్పాద‌క యూనిట్ల‌లో ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ది. బ్రిట‌న్‌లోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవ‌ర్‌. ప్ర‌స్తుతం జాగ్వార్ అండ్ లాండ్ రోవ‌ర్ సంస్థ‌లో సుమారు 40 వేల మంది ప‌ని చేస్తున్నారు.

2025 నాటికి విద్యుత్ కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని జాగ్వార్, 2024 నాటికి విద్యుత్ వాహ‌నాలను ఉత్ప‌త్తి చేస్తామ‌ని అండ్ లాండ్ రోవ‌ర్ సోమ‌వారం ప్ర‌క‌టించింది. 2039 నాటికి పూర్తిగా క‌ర్బ‌న ఉద్గారాల ర‌హిత వాహ‌నాల త‌యారీకి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన జేఎల్ఆర్‌.. రీఇమాజిన్ అనే ప‌థ‌కం పేరిట ఏటా 3.5 బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌త సెప్టెంబ‌ర్‌లో సంస్థ సీఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన థైర్రీ బొల్లోర్.. జేఎల్ఆర్‌లో స‌మూల మార్పులు తీసుకొచ్చారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo