బీజింగ్: చైనా కుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. తాను స్థాపించిన బిజినెస్ స్కూల్ ప్రెసిడెంట్‌గా రాజీనామా చేశారు. జాక్‌మా టెక్నాలజీ సంస్థలపై చైనా నియంత్రణ సంస్థలు కొరడా ఝుళిపించిన నేపథ్యంలో ఆయన తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నది.
చైనాలో అత్యంత ప్రముఖ కార్పొరేట్లలో ఒకరు. జాక్ మా సారధ్యంలోని సంస్థలు అనుసరిస్తున్న గుత్తాధిపత్య పద్దతులకు వ్యతిరేకంగా చైనా నియంత్రణ సంస్థలు కఠిన చర్యలు చేపట్టడంతోపాటు ఫైన్ విధించాయి. గతేడాది అక్టోబర్ నుంచి బయటి ప్రపంచానికి జాక్ మా ఆచూకీ కనిపించడం లేదు.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రభుత్వం.. జాక్ మా ప్రభావాన్ని కనీస స్థాయికి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నది. 2015లో జాక్ మా సొంత పట్టణం హాంగ్జౌలో స్థాపించిన చైనా బిజినెస్ స్కూట్ హుపాన్ యూనివర్శిటీని పునర్వ్యవస్థీకరించారు.
పునర్వ్యవస్థీకరించిన హుపాన్ యూనివర్శిటీ అత్యున్నత సారధ్య హోదా తాను చేపట్టడం లేదని జాక్ మా చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. హుపాన్ యూనివర్సిటీపైనా నిఘా అధికారుల కన్ను పడిందని తెలుస్తున్నది.
అంతేకాదు.. పునర్వ్యవస్థీకరణలో భాగంగా హుపాన్ యూనివర్సిటీ నూతన అడ్మిషన్లను నిలిపివేసింది. పలు ఆంక్షలు, ఆదేశాల మధ్య ఆలీబాబాపై చైనా ప్రభుత్వం 2.8 బిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.
గతేడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక సంస్థలు అమలు చేస్తున్న నియంత్రణలపై విమర్శలు చేసినప్పటి నుంచి జాక్ మాకు కష్టాలు మొదలయ్యాయి. బిజినెస్ స్కూల్‌గా పేరొందిన హుపాన్ యూనివర్సిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయమై ఆ సంస్థ అధికార ప్రతినిధి, ఆలీబాబా స్పందించలేదు.
ధృతరాష్ట్రునిలా వ్యవహరిస్తున్న సోనియా : శివరాజ్ చౌహాన్
కరోనా వ్యాక్సినేషన్.. నదిలో దూకిన ప్రజలు
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
రాజస్థాన్‌లో 600 మందికిపైగా చిన్నారులకు అస్వస్థత.. కరోనా థర్డ్ వేవేనా?
కరోనా కల్లోలంలో దర్శనాలేమిటి మంత్రిగారూ..
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన.. సోదరుడి పెళ్లిలో తహసీల్దార్ డ్యాన్స్..
మాస్క్ లేకుండానే.. బైక్ ర్యాలీలో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
జర ఇవి చూస్కో
విదేశాల్లో కొవాగ్జిన్ ఉత్పత్తిపై ఫోకస్! ఎలాగంటే!!
లాక్‌డౌన్‌తో నిత్యావసరాలు కుదేలు.. ఉత్పత్తి తగ్గించిన ఎఫ్ఎంసీజీ సంస్థలు
ఆకాశానికెత్తారు.. ఆపై పడదోశారు.. ఎందుకు?