అజ్ఞాతం వీడినట్లేనా?

- మూడు నెలల తర్వాత మళ్లీ తెరపైకి జాక్ మా
- గ్రామీణ ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్
- ‘గ్లోబల్ టైమ్స్' వెల్లడి
- అయినా వీడని అనుమానాలు
షాంఘై, జనవరి 20: చైనా వ్యాపారవేత్త, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు మూడు నెలల తర్వాత మళ్లీ దర్శనమిచ్చారు. జిన్‌పింగ్ సర్కార్ ఆగ్రహానికి గురై అక్టోబర్ నుంచి కనిపించకుండా పోయిన జాక్ మా చైనాలోని 100 మంది గ్రామీణ ఉపాధ్యాయులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్లు ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్' వెల్లడించింది. అలీబాబా ప్రధాన కార్యాలయమున్న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ‘తియన్ము న్యూస్' ఈ వార్తను మొదట ప్రసారం చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘గ్లోబల్ టైమ్స్' పత్రిక ఛీఫ్ రిపోర్టర్ కింగ్ కింగ్ చెన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. జాక్ మా అదృశ్యమవలేదని, బుధవారం ఉదయం 100 మంది గ్రామీణ టీచర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారని, కొవిడ్-19 అంతమైన తర్వాత మళ్లీ కలుద్దామని జాక్ మా ఈ సందర్భంగా టీచర్లకు చెప్పారని చెన్ తెలిపారు. అయితే ఇదంతా నేరుగా జరుగకపోవడం, ఈ వీడియోను ఫోన్లో రికార్డు చేసినట్లు ఉండటంతో ఇప్పటికీ అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతేడాది అక్టోబర్ 24న షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. దీనిపై కన్నెర్రజేసిన జిన్‌పింగ్ ప్రభుత్వం.. జాక్ మాపై ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. ఆయన వ్యాపార సంస్థలపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అలీబాబా యాంట్ ఫైనాన్షియల్ గ్రూపు ఐపీవోను అడ్డుకున్నది. దీంతో జాక్ మా ఆస్తులు కరిగిపోయాయి. అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో జాక్ మా ఉపాధ్యాయులతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆ వీడియోలో నిజమెంతన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది.
తాజావార్తలు
- రైతులరా ఆశ కోల్పోవద్దు.. వంద నెలలైనా మీతో ఉంటాం: ప్రియాంక గాంధీ
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు
- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!
- మాచా టీతో డిప్రెషన్ దూరం..!
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత