బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jun 27, 2020 , 00:17:01

ఐటీసీ లాభం రూ.3,926 కోట్లు

ఐటీసీ లాభం రూ.3,926 కోట్లు

న్యూఢిల్లీ, జూన్‌ 26: దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థ ఐటీసీ ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను రూ.3,926.46 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.3,592.80 కోట్లతో పోలిస్తే 9.28 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.93 శాతం తగ్గి రూ.12,560.64 కోట్లకు పడిపోయింది. గతేడాది ఇది రూ.13,212.19 కోట్లుగా ఉన్నది. నిర్వహణ ఖర్చులు 3.14 శాతం తగ్గి రూ.8,484.93 కోట్లకు పరిమితమయ్యాయి. 


logo