సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 25, 2020 , 00:17:58

ఐటీసీకి కరోనా సెగ

ఐటీసీకి కరోనా సెగ

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థల్లో ఒకటైన ఐటీసీ లాభాలకు కరోనా వైరస్‌ గండికొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికిగాను సంస్థ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 25 శాతం తగ్గి రూ.2,567.07 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇది రూ.3,436.51 కోట్లుగా ఉన్నది. 2018-19లో రూ.12,657.90 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికిగాను 17 శాతం పడిపోయి రూ.10,478.46 కోట్లకు పరిమితమైనట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 


logo