ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 18, 2020 , 03:31:00

71,229 కోట్ల ఐటీ రిఫండ్లు

71,229 కోట్ల ఐటీ రిఫండ్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌ 8 నుంచి జూన్‌ 11 మధ్య కాలంలో 21 లక్షల మందికిపైగా ఆదాయ పన్నుచెల్లింపుదారులకు రూ.71,229 కోట్లు వాపసు ఇచ్చినట్టు ఐటీ విభాగం వెల్లడించింది. ఇందులో 19,79 లక్షల మంది వ్యక్తిగత పన్నుచెల్లింపుదారులకు రూ.24,603 కోట్లు, 1.45 లక్షల మంది కార్పొరేట్‌ పన్నుచెల్లింపుదారులకు రూ.46,626 కోట్లు రిఫండ్‌ చేసినట్టు వివరించింది. పన్ను రిఫండ్లకు సంబంధించిన అన్ని డిమాండ్లను ప్రాధాన్య ప్రాతిపదికన పరిష్కరిస్తున్నామని, ఆగస్టు 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తికావచ్చని ఐటీ విభాగం ఓ ప్రకటనలో పేర్కొన్నది. రిఫండ్లు త్వరగా జరుగాలంటే ఐటీ విభాగం పంపే ఈ-మెయిళ్లకు పన్నుచెల్లింపుదారులు వెంటనే ప్రతిస్పందించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సూచించింది.logo