మంగళవారం 26 మే 2020
Business - May 23, 2020 , 00:33:03

రూ.26 వేల కోట్ల ఐటీ రిఫండ్స్‌ చెల్లింపులు

రూ.26 వేల కోట్ల ఐటీ రిఫండ్స్‌ చెల్లింపులు

న్యూఢిల్లీ, మే 22: ప్రజల చేతిలో నగదు లభ్యతను పెంచడానికి ఆదాయ పన్ను శాఖ గడిచిన రెండు నెలల్లో 16.84 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.26,242 కోట్ల ఐటీ రిఫండ్స్‌ చెల్లింపులు జరిపింది. ఏప్రిల్‌ 1 నుంచి మే 21 మధ్యకాలంలో 16,84,298 ట్యాక్స్‌ అసెసెస్‌లు తిరిగి పొందినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) తెలిపింది. వీటిలో రూ.14,632 కోట్ల ఆదాయ పన్ను రిఫండ్స్‌, రూ.11,610 కోట్ల కార్పొరేట్‌ ట్యాక్స్‌ రిఫండ్స్‌ ఉన్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గతవారంలో ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. 


logo