శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 12, 2020 , 01:00:17

ఐటీ ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి!

ఐటీ ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి!

ముంబై, జూలై 11: దీపక్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. లక్షల్లో జీతం.. ఉండటానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు.. బయట తిరుగడానికి కారు. అంతా సవ్యంగా సాగుతున్న ఆయన జీవితాన్ని కరోనా వైరస్‌ కకావికలం చేసింది. జీతం దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగం ఉంటుందా? పోతున్నదా? అనే భయాల మధ్య జీవితాన్ని సాగిస్తున్నాడు. ఇది ఒక దీపక్‌ జీవితం కాదు.. దేశవ్యాప్తంగా 40 లక్షలకుపైగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల ధీనగాథ. ఆటోమేషన్‌ కారణంగా గడిచిన రెండేండ్లుగా క్రమంగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్న ఐటీ సంస్థలను  ఈ వైరస్‌ మహమ్మారి మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో ఆయా సంస్థలు చేసేదేమిలేక నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యాపార రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు అంతర్జాతీయ ప్రాజెక్టులు అటకెక్కడంతో ఆయా సంస్థలు వేలాది మంది సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి.    

ఐబీఎంలో 2 వేల మంది

వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్లు(ఐబీఎం) ఏకంగా 2 వేల మంది సిబ్బందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. దేశీయ సిబ్బందిపై ఏ మేర ప్రభావం పడనున్నది అన్నదానిపై సంస్థ స్పష్టతనివ్వకపోయినప్పటికీ వందలాది మంది ఉపాధికి ఎసెరు పెట్టింది ఈ వైరస్‌ మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 3.50 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వీరిలో మూడోవంతు భారత్‌ నుంచే సేవలు అందిస్తున్నారు. సిబ్బంది తొలగింపుపై ఐబీఎం వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. నాస్‌డాక్‌లో లిైస్టెన కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యుషన్స్‌.. బెంచ్‌ మీద ఉన్న వేలాది మందిని తొలగించినట్లు ప్రకటించిం ది. భారత్‌లో 2 లక్షల మంది సిబ్బందిని కలిగియున్న కాగ్నిజెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.90 లక్షల ఉద్యోగులు ఉన్నారు.


logo