బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 07, 2020 , 02:11:57

ఈ-క్యాలిక్యులేటర్

ఈ-క్యాలిక్యులేటర్
  • వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ప్రారంభించిన ఐటీ శాఖ
  • కొత్త, పాత ఆదాయం పన్ను విధానాల్లోతేడా తెలుసుకునే సౌకర్యం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: కొత్త, పాత ఆదాయం పన్ను (ఐటీ) విధానాల్లో వ్యత్యాసాలను తెలుసుకునేలా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీ శాఖ గురువారం ఈ-క్యాలిక్యులేటర్‌ను ప్రారంభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను గత వారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రకటిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నూతన ఐటీ విధానాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న విధానం కూడా అమల్లో ఉంటుందన్నారు. ఒక్కసారి కొత్త విధానంలోకి మారితే.. మళ్లీ పాత విధానంలోకి మారడం కుదరదని బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసిన సంగతీ విదితమే. దీంతో ఏ విధానం లాభదాయకమన్నదానిపై పన్ను చెల్లింపుదారుల్లో అయోమయం నెలకొన్నది. ఈ సందేహాలను నివృత్తి చేసేలా ఈ-క్యాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల రెండు ఐటీ విధానాల్లో ఏది లాభదాయకమైతే దాన్ని సులభంగా ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకు వస్తుందన్నారు. www.incometax indiaefiling.gov. inలోకి లాగినై ఈ-క్యాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చని వివరించారు.


logo