న్యూఢిల్లీ, జూలై 16: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో రూ.9,375 కోట్ల ఐపీవో సూపర్ సక్సెస్ అయ్యింది. శుక్రవారం ఇష్యూ గడువు ముగిసే సమయానికి 38.25 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. 71.92 కోట్ల షేర్లకు, 2,752 కోట్ల బిడ్స్ అందాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 52 రెట్లు బిడ్స్ వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 7.45 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. అయితే ఉద్యోగులకు 65 లక్షల షేర్లు కేటాయిస్తే.. 62 లక్షల షేర్లకే దరఖాస్తులు వచ్చాయి. రూ.72-76 ధరల శ్రేణిలో ఈ ఐపీవో ఈ నెల 16న ప్రారంభమైన విషయం తెలిసిందే.