నేడు ఐపీవోకు ఐఆర్ఎఫ్సీ

ప్రభుత్వ రంగ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సోమవారం నుంచి ఐపీవోకు బిడ్లను స్వీకరించనుంది. రూ.4,633 కోట్ల నిధులు సమీకరించాలనే లక్ష్యంతో భారత రైల్వే ఆర్థిక సంస్థ (ఐఆర్ఎఫ్సీ) పబ్లిక్ ఆఫర్‌కు వచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ ఐపీవో బిడ్ల స్వీకరణ మొదలవుతుంది. ఒక్కో షేర్ ధర రూ.25-రూ.26 మధ్య ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి యాంకర్ ఇన్వెస్టర్లకు 15వ తేదీ నుంచే బుకింగ్స్‌ను ఐఆర్ఎఫ్సీ అనుమతించింది. శుక్రవారం నాటిటే ఈ సంస్థ రూ.1,398 కోట్లను సేకరించినట్లు సమాచారం.
ఒక ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీ ఐపీవోకు రావడం ఇదే తొలిసారి. లిస్టింగ్‌కు వచ్చిన ఐదో రైల్వే కంపెనీ ఇదే. ఈ ఆఫర్లో 50శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్లకు రిజర్వు చేశారు. 15శాతం నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించారు. మిగిలిన 35శాతం వాటాలను మాత్రం రిటైల్ ఇన్వెస్టర్లకు ఐఆర్ఎఫ్సీ విక్రయించనున్నది. ఐఆర్ఎఫ్సీ వ్యాపారం విభిన్నంగా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం కానీ, రైల్వే మంత్రిత్వశాఖ కానీ నిబంధనలు మారిస్తే దీని లాభాలపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి ఈ ఐపీవోలోని ప్రైస్‌బ్యాండ్‌ను చూస్తే కొనుగోలుదారులకు చౌకగానే వాటాలను అందిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల ఐపీవోకు వచ్చిన రైల్వే సంస్థలు మొత్తం లిస్టింగ్ సమయంలో లాభాలను అందించాయి. దీంతో ఐఆర్ఎఫ్సీపైనా ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకొన్నారు.ఐఆర్ఎఫ్సీ సాధారణంగా భారతీయ రైల్వేలకు బహిరంగ మార్కెట్లో రుణ పరపతి కల్పించే సంస్థ. 1,782,069,000 షేర్లను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఐఆర్ఎఫ్సీ రూ. 71,392 కోట్లు ఫైనాన్స్ చేయగలిగింది. ఇది భారతీయ రైల్వేల ఖర్చులో 48.22 శాతం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.