హెల్త్ ప్రొవైడర్లతో ఒప్పందాలు

- కొవిడ్-19 చికిత్స రేట్లపై బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచన
- పాలసీలపై పరిశీలనకు నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ, జనవరి 13: వివిధ రకాల వ్యాధుల చికిత్సకు సంబంధించిన రేట్లపై హెల్త్ ప్రొవైడర్లతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లుగానే కొవిడ్-19 చికిత్సకు సంబంధించిన రేట్లపై కూడా వారితో ఒప్పందాలను కుదుర్చుకోవాలని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సూచించింది. ఈ మేరకు బుధవారం ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఆరోగ్య బీమా పాలసీ కింద పాలసీదారులు ‘నగదు రహిత క్లెయిమ్‌లు’ చేసుకున్నట్లయితే.. సంబంధిత చట్టంలోని నియమ నిబంధనల ప్రకారం ఉభయ పక్షాలు నిర్ణయించిన ధరలకు అనుగుణంగా ఆ క్లెయిమ్‌లను సెటిల్ చేయాలని ఆ సర్క్యులర్‌లో ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణమైన ఆరోగ్య బీమా పాలసీలు దేశంలో అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించడంతోపాటు సమాజానికి తగిన బీమా పాలసీలను సిఫారసు చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో గత కొన్నేండ్ల నుంచి ఆరోగ్య బీమా రంగం గణనీయంగా వృద్ధి చెందింది. కొవిడ్-19 సంక్షోభం వల్ల తలెత్తిన సమస్యలతో ఈ పాలసీలను తీసుకునేవారి సంఖ్య ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో వివిధ బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఆరోగ్య పాలసీలు, సేవలు సమాజ అవసరాలకు తగినట్లుగా ఉన్నయో లేదో పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐఆర్డీఏఐ వెల్లడించింది.
తాజావార్తలు
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు
- మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ
- UPI యూజర్లకు గమనిక.. ఆ టైమ్‌లో పేమెంట్స్ చేయొద్దు
- టోక్యో ఒలింపిక్స్ రద్దు.. జపాన్ ప్రభుత్వ నిర్ణయం!