బుధవారం 03 మార్చి 2021
Business - Feb 09, 2021 , 01:55:30

ఇలిప్స్‌ అవసరం

ఇలిప్స్‌ అవసరం

  • ఐఆర్డీఏఐ కమిటీ సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఇండెక్స్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్రోడక్ట్స్‌ (ఇలిప్స్‌)ను పరిచయం చేయాలని బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్డీఏఐ కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుత కన్వెన్షనల్‌ గ్యారెంటీడ్‌ ప్రోడక్ట్స్‌, యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్రోడక్ట్స్‌ (యులిప్స్‌)కు ఓ ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకోవచ్చన్నది. దేశీయంగా ఇలిప్స్‌ అవసరంపై పరిశీలన కోసం గతేడాది ఆగస్టులో ఐఆర్డీఏఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిప్పుడు తమ నివేదికను సమర్పించగా, దీనిపై వచ్చే నెల 8లోగా తమ అభిప్రాయాలను తెలుపవచ్చని పరిశ్రమకు ఐఆర్డీఏఐ సూచించింది. ఇదిలావుంటే జీవిత బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం గత నెల 3.72 శాతం పెరిగింది. జనవరిలో రూ.21,389.70 కోట్లుగా ఉన్నట్లు సోమవారం ఐఆర్డీఏఐ గణాంకాల్లో వెల్లడైంది. అయితే ఎల్‌ఐసీ వాటా గతంతో పోల్చితే 2.43 శాతం పడిపోవడం గమనార్హం.


VIDEOS

logo