బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jun 28, 2020 , 01:28:46

కరోనా కవచ్‌ పాలసీ

కరోనా కవచ్‌ పాలసీ

  • వచ్చే నెల 10కల్లా అందుబాటులోకి తేవాలని
  • బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం

న్యూఢిల్లీ, జూన్‌ 27: దేశంలో కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ కరోనా పాలసీలను తీసుకురావాలని బీమా కంపెనీలను ఆదేశించింది. వచ్చే నెల 10కల్లా స్వల్పకాలిక కొవిడ్‌ స్టాండర్డ్‌ ఆరోగ్య బీమా లేదా ‘కరోనా కవచ్‌ పాలసీ’ని తేవాలని జనరల్‌, ఆరోగ్య బీమా సంస్థలకు స్పష్టం చేసింది. మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల్లో ఈ పాలసీలను అందుబాటులోకి తేవాలని ఐఆర్‌డీఏఐ తమ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నది. కొవిడ్‌-19 స్టాండర్డ్‌ హెల్త్‌ పాలసీ శ్రేణి రూ.50 వేల నుంచి 5 లక్షల వరకు ఉండనున్నది. 


logo