సోమవారం 01 మార్చి 2021
Business - Jan 06, 2021 , 23:53:01

అగ్ని ప్రమాదాలపై కొత్త పాలసీలు

అగ్ని ప్రమాదాలపై కొత్త పాలసీలు

  • ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరి
  • బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

న్యూఢిల్లీ, జనవరి 6: అగ్నిప్రమాదం, దాని అనుబంధ ప్రమాదాలకు సంబంధించి మూడు స్టాండర్డ్‌ కవరేజీ రిస్క్‌ పాలసీలను తీసుకురావాలని బీమా సంస్థలను ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ బీమా పాలసీలను అన్ని జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు తప్పక అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. స్టాండర్డ్‌ ఫైర్‌ అండ్‌ స్పెషల్‌ పెరిల్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ) పాలసీ స్థానంలో భారత్‌ గృహ రక్ష, భారత్‌ సూక్ష్మ ఉద్యం సురక్ష, భారత్‌ లఘు ఉద్యం సురక్ష పేరుతో మూడు స్టాండర్డ్‌ బీమా పాలసీలను ప్రవేశపెట్టాలని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ బీమా ఉత్పత్తులు పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాం. ఇంకా చెప్పాలంటే సాధారణ ప్రజానీకం సౌకర్యార్థం తెస్తున్నాం’ అని ఐఆర్డీఏఐ వెల్లడించింది. వాటర్‌ ట్యాంకుల ఓవర్‌ఫ్లో, పేలుడు, తీవ్రవాద చర్యలతో, సమ్మెలు, అల్లర్లు, ఇతరత్రా హానికర నష్టాలతో ధ్వంసమైన ఇండ్లకు భారత్‌ గృహ రక్ష పాలసీ వర్తిస్తుందని చెప్పింది. ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల కోసం భారత్‌ సూక్ష్మ ఉద్యం సురక్ష, భారత్‌ లఘు ఉద్యం సురక్ష పాలసీలు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నది.


VIDEOS

logo