సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 25, 2020 , 00:17:43

గ్రూప్‌ ఇన్సూరెన్స్‌గా ఆరోగ్య సంజీవని: ఐఆర్డీఏఐ

గ్రూప్‌ ఇన్సూరెన్స్‌గా ఆరోగ్య సంజీవని: ఐఆర్డీఏఐ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆరోగ్య సంజీవని పాలసీని కూడా గ్రూప్‌ ఆరోగ్య బీమాగా విక్రయించేందుకు బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్డీఏఐ అనుమతినిచ్చింది. శుక్రవారం ఈ మేరకు అన్ని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు స్పష్టం చేసింది. ఇప్పటికే ‘కరోనా కవచ్‌' పాలసీని గ్రూప్‌ ఇన్సూరెన్స్‌గా ఆఫర్‌ చేసేందుకు బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ వెసులుబాటును ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలతో వ్యాపార, ఇతరత్రా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఆరోగ్య పాలసీలు పొందే అవకాశం లభిస్తున్నది. ఈ పాలసీల్లో కరోనా చికిత్సను వ్యక్తులు లేదా బృందాలు (సంస్థాగత ఉద్యోగులు లేదా కార్మికులు) అందుకోవచ్చని ఐఆర్డీఏఐ తెలియజేసింది. 


logo