గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 06, 2021 , 19:23:39

ఐఆర్సీటీసీలో ఇక ఆన్‌లైన్ బ‌స్సు రిజ‌ర్వేష‌న్‌.. వివ‌రాలివే!

ఐఆర్సీటీసీలో ఇక ఆన్‌లైన్ బ‌స్సు రిజ‌ర్వేష‌న్‌.. వివ‌రాలివే!

న్యూఢిల్లీ: ఇప్ప‌టి వ‌ర‌కు రైళ్ల రిజ‌ర్వేష‌న్‌, టికెట్ బుకింగ్‌, క్యాట‌రింగ్ కార్య‌క‌లాపాలు నిర్వ‌ర్తించిన ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్సీటీసీ) తాజాగా ఆన్‌లైన్ బ‌స్సు టికెట్ బుకింగ్ స‌ర్వీస్ ప్రారంభించింది. రైల్వే, వాణిజ ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తున్న ఐఆర్సీటీసీ.. దేశ‌వ్యాప్తంగా వ‌న్ స్టాప్ షాప్ ట్రావెల్ పోర్ట‌ల్ సేవ‌ల‌ను అందుబాటులోకి తేవాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ విధానం అమ‌లు చేయ‌డానికి శ్రీ‌కారం చుట్టింది. 

ఈ స్కీం అమ‌లులో భాగంగా 22 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చెందిన 50 వేలకు పైగా ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ‌స్సు ఆప‌రేట‌ర్ల‌తో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. గ‌త నెల 29 నుంచి ఆన్‌లైన్ బ‌స్సు టికెట్ బుకింగ్ సేవ‌ల‌ను ప్రారంభించింది. ఒక ట్రాన్సాక్ష‌న్‌లో గ‌రిష్ఠంగా ఆరుగురు ప్ర‌యాణికులు టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు. ఏపీఎస్ఆర్టీసీతోపాటు యూపీఎస్ఆర్టీసీ, జీఎస్ఆర్టీసీ, ఓఎస్ఆర్టీసీ, కేర‌ళ ఆర్టీసీ స‌హా దాదాపు అన్ని రాష్ట్రాల ఆర్టీసీ బ‌స్సుల్లో టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు. అయితే టికెట్ బుకింగ్‌కు ముందే ఆయా బ‌స్సుల్లో పొజిష‌న్‌ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

మొబైల్ ఫోన్ ద్వారా ఐఆర్సీటీసీ బ‌స్సు టికెట్ల బుకింగ్ సౌకర్యం కూడా త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న‌ది. ఇందుకోసం ఐఆర్సీటీసీ-మొబైల్ యాప్ త‌యారీ వ‌చ్చేనెల మొద‌టివారంలో పూర్తి కానున్న‌ది. వివిధ ర‌కాల మార్గాల్లో వెళ్లే బ‌స్సుల్లో వ‌స‌తులు, వాటిలో ప్ర‌యాణంపై స‌మీక్ష‌లు, సంబంధిత బ‌స్ ఇమేజీలు కూడా చూసుకోవ‌చ్చు. దీంతోపాటు వినియోగ‌దారులు త‌మ పిక‌ప్ అండ్ డ్రాప్ పాయింట్ల‌ను, బ‌స్ టైమింగ్ కూడా ఎంచుకుంటే ఆమోద‌యోగ్య‌మైన ధ‌ర‌కే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ఈ-వ్యాలెట్ డిస్కౌంట్లు కూడా ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo